కంట్లో ఆరు అంగుళాల కత్తి.. శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు

ఓ వ్యక్తి కంట్లో దిగిన ఆరు అంగుళాల కత్తిని వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. మహారాష్ట్రలోని ధులేలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందుర్బార్‌ జిల్లా తలోడా తాలుకాకు చెందిన విలన్‌ సోమా భిలావే(41) కంట్లో ప్రమాదవశాత్తూ కత్తి గుచ్చుకుంది.

Updated : 11 Aug 2022 07:26 IST

ఓ వ్యక్తి కంట్లో దిగిన ఆరు అంగుళాల కత్తిని వైద్యులు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. మహారాష్ట్రలోని ధులేలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందుర్బార్‌ జిల్లా తలోడా తాలుకాకు చెందిన విలన్‌ సోమా భిలావే(41) కంట్లో ప్రమాదవశాత్తూ కత్తి గుచ్చుకుంది. కుటుంబసభ్యులు అతడిని ధులేలోని బావూసాహెబ్‌ హీరే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి 2.30 గంటలకు బాధితుడు ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు  ఉదయానికల్లా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ‘‘చెవులు, ముక్కు, గొంతుకు ఏమైనా గాయాలు అయ్యాయేమోనని అనుకున్నాం. అత్యంత సవాలుతో కూడిన క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశాం’’ అని వైద్యులు తెలిపారు. కంట్లో ఉన్న వస్తువును లోహపు పట్టీ అని తొలుత భావించామని, తొలగించిన తర్వాతే అది కత్తి అని తెలిసిందని చెప్పారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్‌ ముకర్రమ్‌ ఖాన్‌, ఆయన బృందంపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని