ముగ్గురు బాలికలపై అత్యాచారం

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జులై 6న జరగగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

Published : 12 Aug 2022 06:34 IST

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జులై 6న జరగగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 14లోగా నిందితుడిపై దిల్లీ పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు బాలికలు దిల్లీ నుంచి ముంబయి వెళ్లేందుకు జులై 6న న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. వీరికి రైల్వే టికెట్లు బుక్‌ చేస్తానని నమ్మించి ఓ యువకుడు రోహిణిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు బాలికలకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ముంబయి వెళ్లాలని తమను పంపమని బాలికలు నిందితుడ్ని కోరారు. అప్పుడు రాజస్థాన్‌ తీసుకెళ్లి.. అక్కడ ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని బాలికలతో చెప్పాడు. వీరు బస్సు ఎక్కే సమయంలో నిందితుడి నుంచి తప్పించుకుని బాలికలు తమ ఇంటికి చేరుకున్నారు. వారిపై జరిగిన అత్యాచారం గురించి కుటుంబ సభ్యులకు వివరించారు. దీంతో కుటుంబ సభ్యులు డిఫెన్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts