హిజ్బుల్‌ చీఫ్‌ కుమారుడు సహా ఉద్యోగుల తొలగింపు

నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడు సయీద్‌ అబ్దుల్‌ ముయీద్‌, వేర్పాటువాది బిట్టా కరాటే భార్య అస్సాబ్‌ ఉల్‌ అర్జామండ్‌ ఖాన్‌ సహా నలుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం శనివారం విధుల నుంచి తొలగించింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో సంబంధాలు కలిగి ఉండటం,

Published : 14 Aug 2022 05:52 IST

శ్రీనగర్‌: నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయీద్‌ సలావుద్దీన్‌ కుమారుడు సయీద్‌ అబ్దుల్‌ ముయీద్‌, వేర్పాటువాది బిట్టా కరాటే భార్య అస్సాబ్‌ ఉల్‌ అర్జామండ్‌ ఖాన్‌ సహా నలుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం శనివారం విధుల నుంచి తొలగించింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులతో సంబంధాలు కలిగి ఉండటం, దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో వీరిపై వేటు వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి విచారణ లేకుండా ఉద్యోగులను తొలగించేందుకు వీలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ప్రకారం ఈ చర్య తీసుకున్నారు. సయీద్‌ అబ్దుల్‌ ముయీద్‌(ఇన్ఫర్మేషన్‌, టెక్నాలజీ) వాణిజ్యం, పరిశ్రమల శాఖలో మేనేజర్‌గా ఉన్నాడు. ఉద్యోగం నుంచి తొలగించిన ఇతను హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ మూడో కుమారుడు. మరో ఇద్దరు కుమారులను గత ఏడాది ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసివేసింది. ఫరూక్‌ అహ్మద్‌ దార్‌ అలియాస్‌ బిట్టా కరాటే భార్య అస్సాబ్‌ ఉల్‌ అర్జామండ్‌ ఖాన్‌ 2011 బ్యాచ్‌కు చెందిన జమ్ము కశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అధికారిణి. పాస్‌పోర్ట్‌ కోసం ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని