మహనీయుల త్యాగాలను తక్కువచేసే యత్నం

రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ‘తక్కువచేసి చూపడం’, చారిత్రక వాస్తవాలను ‘వక్రీకరించే’ ప్రయత్నాలపై పోరాడుతామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టంచేశారు. ‘‘మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌,

Updated : 16 Aug 2022 06:10 IST

చరిత్రను వక్రీకరిస్తున్నారు
వీటిపై గట్టిగా పోరాడతాం: సోనియా

దిల్లీ: రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ‘తక్కువచేసి చూపడం’, చారిత్రక వాస్తవాలను ‘వక్రీకరించే’ ప్రయత్నాలపై పోరాడుతామని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టంచేశారు. ‘‘మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌, అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వంటి నేతలపై తప్పుడు ప్రచారాలు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొడతాం. స్వాత్కర్షలో మునిగిపోయిన నేటి ప్రభుత్వం వీరి త్యాగాలను తక్కువ చేసి చూపుతోంది’’ అని ఆమె ఒక సందేశంలో పేర్కొన్నారు. 1947లో దేశ విభజనకు దారితీసిన పరిణామాలపై భాజపా ఆదివారం వీడియో విడుదల చేసిన నేపథ్యంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో నాటి కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తప్పుబట్టేలా ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు సోమవారం దిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. సోనియా కొవిడ్‌ బారినపడిన నేపథ్యంలో సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, కె.సి.వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ‘ఆజాదీ గౌరవ్‌ మార్చ్‌’ పేరిట పార్టీ కార్యాలయం నుంచి తీస్‌ జనవరి రోడ్డులోని గాంధీ స్మృతి వరకూ వందల మంది కార్యకర్తలతో నేతలు ర్యాలీ నిర్వహించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts