కేరళ న్యాయమూర్తి.. మరో వివాదాస్పద ఉత్తర్వు

అసభ్యకర దుస్తులు ధరించే మహిళలు వేసే లైంగిక వేధింపుల కేసులు నిలబడవని పేర్కొన్న కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి మరో వివాదాస్పద ఉత్తర్వు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కుల వ్యవస్థకు

Published : 19 Aug 2022 04:49 IST

కోజికోడ్‌: అసభ్యకర దుస్తులు ధరించే మహిళలు వేసే లైంగిక వేధింపుల కేసులు నిలబడవని పేర్కొన్న కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి మరో వివాదాస్పద ఉత్తర్వు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిందితుడికి ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆసక్తికరమేంటంటే.. లైంగిక వేధింపుల కేసులోనూ, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కేసులోనూ నిందితుడు 74 ఏళ్ల సివిక్‌ చంద్రనే కావడం గమనార్హం. రచయిత, ఉద్యమకారుడైన చంద్రన్‌.. లైంగికంగా వేధించారని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఇందులో ఓ మహిళ.. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే, మరో మహిళ లైంగికవేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ న్యాయమూర్తి.. నిందితుడు చంద్రన్‌కు సంబంధిత చట్టాలు వర్తించవని తీర్పునిస్తూ ఈ నెల 2,12 తేదీల్లో బెయిల్‌ మంజూరు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని