బిహార్‌లో భారీ కీటకం సందడి

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కీటకాల్లో ఒకటైన అట్లాస్‌ మాత్‌ బిహార్‌లోని బఘా గ్రామంలో సందడి చేస్తోంది. సీతాకోకచిలుకలా ఉండే ఈ జీవి రెక్కల వెడల్పు 12-17 సెంటీమీటర్లు. వాటి అంచులు పాము తలను పోలి ఉంటాయి

Published : 27 Sep 2022 05:53 IST

 పూజలు చేస్తున్న స్థానికులు

బఘా: ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కీటకాల్లో ఒకటైన అట్లాస్‌ మాత్‌ బిహార్‌లోని బఘా గ్రామంలో సందడి చేస్తోంది. సీతాకోకచిలుకలా ఉండే ఈ జీవి రెక్కల వెడల్పు 12-17 సెంటీమీటర్లు. వాటి అంచులు పాము తలను పోలి ఉంటాయి. గ్రామంలో ఒక బల్బు వెనుక దాగున్న ఈ కీటకాన్ని చూసి స్థానికులు తొలుత భయపడ్డారు. ఆ తర్వాత దాన్ని వనదేవతగా భావించి, పూజించడం మొదలుపెట్టారు. వేరే జీవుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు భావిస్తే రెక్కలను టపటపలాడించడం ద్వారా వాటిని భయపెట్టడానికి అట్లాస్‌ మాత్‌ ప్రయత్నిస్తుంది. రాత్రివేళ మాత్రమే సంచరించే ఈ ప్రాణి.. చాలా అరుదుగానే దర్శనమిస్తుంటుంది. ఆఫ్రికా, స్పెయిన్‌, జపాన్‌, చైనా, మలేసియా, అమెరికా వంటి చోట్ల ఇది కనిపిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని