Cheetah: చీతాల నామకరణానికి సూచనల వెల్లువ

మిల్ఖా.. చేతక్‌.. గౌరి.. వీర్‌.. భైరవ్‌. నమీబియా నుంచి సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు చేరిన చీతాల నామకరణానికి ప్రజల నుంచి వస్తున్న సూచనలివి. తన జన్మదినం సందర్భంగా 8 చీతాలను కునో పార్కులో

Updated : 28 Sep 2022 07:36 IST

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని పిలుపునకు స్పందన

దిల్లీ: మిల్ఖా.. చేతక్‌.. గౌరి.. వీర్‌.. భైరవ్‌. నమీబియా నుంచి సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు చేరిన చీతాల నామకరణానికి ప్రజల నుంచి వస్తున్న సూచనలివి. తన జన్మదినం సందర్భంగా 8 చీతాలను కునో పార్కులో వదిలిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాటికి పేర్లను సూచించమని ప్రజలను కోరిన విషయం తెలిసిందే. గత ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ పేర్లు పంపాలని కోరిన మోదీ మళ్లీ మంగళవారం మరోమారు ఈ విజ్ఞప్తి చేశారు. ‘మైగవ్‌’ వేదికకు పంపిన పేర్ల నుంచి విజేతలను ఎంపిక చేసి కునో జాతీయ పార్కులో చీతాల  సందర్శనకు అనుమతిస్తారు. ఈ పోటీకి పేర్లు పంపేందుకు చివరి తేదీ అక్టోబర్‌ 26. ప్రజల నుంచి ఇప్పటిదాకా 750 సూచనలు అందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని