దివ్యాంగులకు కృత్రిమ స్మార్ట్‌ లింబ్‌

తాను ఉపయోగించే మైక్రో ప్రాసెసర్లతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృత్రిమ స్మార్ట్‌ లింబ్‌ను అభివృద్ధి చేసింది. దీని సాయంతో దివ్యాంగులు సులువుగా నడిచే వీలుంది.

Updated : 30 Sep 2022 06:12 IST

మరింత సులువుగా నడక

అభివృద్ధి చేసిన ఇస్రో

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తాను ఉపయోగించే మైక్రో ప్రాసెసర్లతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృత్రిమ స్మార్ట్‌ లింబ్‌ను అభివృద్ధి చేసింది. దీని సాయంతో దివ్యాంగులు సులువుగా నడిచే వీలుంది. మైక్రో ప్రాసెసర్‌-కంట్రోల్డ్‌ నీస్‌గా (ఎంపీకే) పిలిచే లింబ్‌ బరువు సుమారు 1.6 కిలోలు ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఎంపీకేలను ఇస్రో పలు సంస్థలతో కలిసి సిద్ధం చేస్తోంది. లింబ్‌లో మైక్రోప్రాసెసర్‌, హైడ్రాలిక్‌ డంపర్‌, మోకాలి యాంగిల్‌ సెన్సర్లు, కాంపోజిట్‌ కేస్‌, లిథియం అయాన్‌ బ్యాటరీ, ఎలక్ట్రికల్‌ హార్నెస్‌, ఇంటర్‌ఫేస్‌   ఎలిమెంట్స్‌ వంటివి ఉన్నాయని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇది సెన్సర్‌ డేటా ఆధారంగా నడక స్థితిని గుర్తిస్తుంది. కొన్ని మార్పులతో కావాల్సిన నడక వేగాన్ని సాధించడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో ఎంపీకే తయారీకి రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా ఖర్చవుతోందని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. వాణిజ్య అవసరాల కోసం తయారు చేయనుండటంతో భవిష్యత్తులో ధర తగ్గి రూ.4-5 లక్షలు ఉంటుందని ఇస్రో అంచనా వేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని