నాలుగు రాష్ట్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు

అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు చేరవేసేందుకు వీలుగా ఏటా నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)

Published : 01 Oct 2022 05:12 IST

హాజరుకానున్న గవర్నర్లు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు చేరవేసేందుకు వీలుగా ఏటా నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌లో ఈనెల 4న తమిళనాడు గవర్నర్‌ కేఎన్‌ రవి వీటిని ప్రారంభిస్తారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 5న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, పుదుచ్చేరిలో 7న తెలంగాణతోపాటు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ తమిళిసై, ఒడిశాలోని కటక్‌లో 12న అక్కడి గవర్నర్‌ గణేశిలాల్‌ ప్రారంభించనున్నారు. వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విజయవాడ, శ్రీహరికోట, పుట్టపర్తి, తమిళనాడులోని వేలూరు, ఒడిశాలోని కటక్‌, పుదుచ్చేరిలోని కరైకల్‌లో నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా ప్రదర్శన, ఫిలిం షో, సదస్సులు, విద్యార్థులకు క్విజ్‌, డ్రాయింగ్‌, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని