వందేళ్ల ఓటర్లకు ఎన్నికల సంఘం వందనాలు

దేశవ్యాప్తంగా వందేళ్లు దాటిన 2.5 లక్షలకు పైగా ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగతంగా లేఖలు రాసింది. మీలాంటి బాధ్యతయుతమైన ఓటర్ల వలనే దేశంలో

Updated : 02 Oct 2022 06:58 IST

మీ వల్లే ప్రజాస్వామ్యం బలోపేతమైందంటూ లేఖలు

దిల్లీ: దేశవ్యాప్తంగా వందేళ్లు దాటిన 2.5 లక్షలకు పైగా ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగతంగా లేఖలు రాసింది. మీలాంటి బాధ్యతయుతమైన ఓటర్ల వలనే దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని పేర్కొంది. ‘‘ఎప్పటి నుంచో ఓట్లు వేస్తూ.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ.. నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలిచారు’’ అని లేఖలో సీనియర్‌ ఓటర్లను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ అభినందించారు. యువతకు మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని