ఇద్దరిదీ ఒకే గోత్రం..అన్నాచెల్లెలు అవుతారంటూ జంటను విడదీసిన పెద్దలు

వారిద్దరు ఒకే చోట చదువుకున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కలిసుండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేలోపే ఆ గ్రామ పంచాయతీ తీర్పు వారిద్దరిని విడిపోయేలా చేసింది.

Updated : 05 Oct 2022 06:45 IST

వారిద్దరు ఒకే చోట చదువుకున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కలిసుండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేలోపే ఆ గ్రామ పంచాయతీ తీర్పు వారిద్దరిని విడిపోయేలా చేసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో జరిగింది. మేరఠ్‌లోని ఓ కళాశాలలో శివమ్‌ అనే యువకుడు, తనూ అనే యువతి కలిసి చదువుకునేవారు. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వారిద్దరు దైవ సమక్షంలో వివాహం చేసుకున్నారు. మరోవైపు, దంపతుల గోత్రం ఒక్కటేనంటూ గ్రామపెద్దలు ఈ వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లెక్కప్రకారం వీరిద్దరూ అన్నాచెల్లెలు అవుతారని అందువల్ల వీరి వివాహం రద్దు చేస్తున్నామని తీర్పు ఇచ్చారు. ఇలాంటి వారికి వివాహం జరిపిస్తే ఊరికి మంచిది కాదని అంటున్నారు. గ్రామ పెద్దలిచ్చిన తీర్పునకు అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌కు గురైన ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని