నిన్న గేదెలు.. నేడు ఆవు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ప్రారంభించిన ముంబయి - గాంధీనగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం మరో ప్రమాదాన్ని ఎదుర్కొంది.

Published : 08 Oct 2022 04:05 IST

‘వందేభారత్‌’ రైలుకు వరుస ప్రమాదాలు

వడోదర: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం ప్రారంభించిన ముంబయి - గాంధీనగర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం మరో ప్రమాదాన్ని ఎదుర్కొంది. గురువారం అహ్మదాబాద్‌ సమీపంలోని వట్వా రైల్వేస్టేషను వద్ద గేదెలను ఢీకొనగా.. 4 గేదెలు మృతిచెంది, రైలు ముందుభాగం దెబ్బతిన్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్‌ నుంచి ముంబయికి బయలుదేరిన రైలు వంద కి.మీ.ల దూరంలోని ఆనంద్‌ స్టేషను సమీపంలో ఆవును ఢీకొంది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని