ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు.. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

హిందీ, ప్రాంతీయ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

Published : 10 Oct 2022 02:08 IST

దిల్లీ: హిందీ, ప్రాంతీయ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ఐఐటీల్లాంటి ఉన్నత సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లోంచి బోధనామాధ్యమంగా ఇంగ్లిషును క్రమంగా తప్పించాలని సూచించింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీలో, మిగతా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిషు కంటే స్థానిక భాషలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తన సిఫార్సుల్లో స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని