రామ జన్మభూమి చరిత్రపై దృశ్యకావ్యానికి అమితాబ్‌ స్వరం?

శ్రీరామ జన్మభూమి చరిత్రపై తీసుకొచ్చే చిత్రానికి స్వరం అందించాలని ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కోరినట్టు అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 26 Nov 2022 04:58 IST

దిల్లీ: శ్రీరామ జన్మభూమి చరిత్రపై తీసుకొచ్చే చిత్రానికి స్వరం అందించాలని ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కోరినట్టు అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను ప్రముఖ రచయిత, ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రసూన్‌ జోషి, దర్శకుడు డా.చంద్రప్రకాశ్‌ ద్వివేది, ప్రముఖ రచయిత యతీంద్ర మిశ్రా, ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌ కార్యదర్శి సచిదానంద జోషిలతో కూడిన కమిటీకి అప్పగించినట్టు వెల్లడించింది. కాగా- వాల్మీకి రామాయణంలోని ఘట్టాల ఆధారంగా సుమారు వంద ఐకానోగ్రాఫిక్‌ ప్యానెళ్లను అయోధ్యలో నిర్మితమవుతున్న ఆలయ స్తంభాలపై ఏర్పాటు చేయనున్నట్టు నిర్మాణ కమిటీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని