ఏంటీ.. 3 నిమిషాల సమయమిస్తారా!

బడ్జెట్‌ రూపకల్పన నిమ్తితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 28న వీడియో విధానంలో నిర్వహించ తలపెట్టిన చర్చలకు దూరంగా ఉండాలని పది కేంద్ర కార్మిక సంఘాల వేదిక నిర్ణయించింది.

Published : 27 Nov 2022 03:52 IST

వీడియో విధానంలో బడ్జెట్‌ చర్చలకు కార్మిక సంఘాల విముఖత
హాజరు కాబోమంటూ ఆర్థిక శాఖకు లేఖ

దిల్లీ: బడ్జెట్‌ రూపకల్పన నిమ్తితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈనెల 28న వీడియో విధానంలో నిర్వహించ తలపెట్టిన చర్చలకు దూరంగా ఉండాలని పది కేంద్ర కార్మిక సంఘాల వేదిక నిర్ణయించింది. తమతో నేరుగా మాట్లాడాలని, తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు సముచిత సమయం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. చర్చలను వీడియో ద్వారా నిర్వహిస్తామని, ఒక్కో కార్మిక సంఘానికి మూడు నిమిషాల సమయం ఇస్తామని ఈ-మెయిల్‌ ద్వారా చెప్పడం హాస్యాస్పదమని వేదిక పేర్కొంది. ఇలాంటి చవకబారు జోకులో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని, వీడియో సమావేశానికి తాము హాజరు కాబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖకు లేఖ పంపింది.

ఈ వేదికలో కార్మిక సంఘాలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, ఏఐయూటీయూసీ, యూటీయూసీ ఉన్నాయి. ఏటా బడ్జెట్‌ రూపకల్పనకు ముందు వివిధ రంగాలు, వర్గాల నుంచి ప్రభుత్వం వారి డిమాండ్లు, అభిప్రాయాలను తెలుసుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని