సర్పంచి ఎన్నికల్లో ఓడిన అభ్యర్థికి రూ.11 లక్షల నగదు, కారు

హరియాణాలో అరుదైన ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఓ అభ్యర్థికి గ్రామస్థులు భారీగా నగదు, కారు, కొంత భూమిని బహుమతిగా ఇచ్చారు. 

Published : 28 Nov 2022 04:23 IST

హరియాణాలో అరుదైన ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఓ అభ్యర్థికి గ్రామస్థులు భారీగా నగదు, కారు, కొంత భూమిని బహుమతిగా ఇచ్చారు. ఫతేహాబాద్‌లోని నధోడి గ్రామానికి పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సుందర్‌, నరేంద్ర అనే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. ఆ గ్రామంలో మొత్తం 5,085 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 4,416 ఓట్లు పోల్‌ కాగా.. అందులో సుందర్‌కు 2,200 ఓట్లు పడగా.. నరేందర్‌కు 2,201 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో సుందర్‌ ఓడిపోయారు. అప్పుడు సుందర్‌ను సన్మానించిన గ్రామస్థులు రూ.11,11,000 నగదు అందించారు. అంతేకాదు.. ఓ స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, కొంత భూమిని సైతం ఇచ్చారు. ఫరీదాబాద్‌ జిల్లాలోని ఫతేఫుర్‌ తాగా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచినీ సన్మానించారు. రూ.11 లక్షల విలువైన అయిదు వందల రూపాయల నోట్లతో భారీ గజమాల తయారు చేసి సర్పంచి మెడలో వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని