ఒకే వ్యక్తిని పెళ్లాడిన కవల సోదరీమణులు

కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. మహారాష్ట్రలోని శోలాపుర్‌లో ఈ అరుదైన వివాహం జరిగింది.

Published : 05 Dec 2022 05:04 IST

కవల సోదరీమణులు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. మహారాష్ట్రలోని శోలాపుర్‌లో ఈ అరుదైన వివాహం జరిగింది. వరుడు అతుల్‌ స్వస్థలం శోలాపుర్‌ కాగా.. కవల వధువులు ముంబయిలోని కండివాలికి చెందినవారు. అతుల్‌.. ట్రావెల్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. వధువులు పింకీ, రింకీ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వీరి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించారు. ఆరు నెలల క్రితం పింకీ, రింకీల తల్లి అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో అతుల్‌ తన ట్యాక్సీలో వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి రెండు కుటుంబాలు సమ్మతి తెలిపాయి. దీంతో పింకీ, రింకీలు అతుల్‌ను పెళ్లాడారు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వారు అతుల్‌పై కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు