రక్షణ రంగ సంస్థల్లోనూ వాటాల తగ్గింపు!

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు లాభ నష్టాలతో సంబంధం లేదని కుండబద్దలు కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వాటా తగ్గించుకోవాలని భావిస్తోంది....

Published : 16 Mar 2021 13:46 IST

దిల్లీ: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు లాభ నష్టాలతో సంబంధం లేదని కుండబద్దలు కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. రక్షణకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వాటా తగ్గించుకోవాలని భావిస్తోంది. రక్షణ రంగానికి చెందిన భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌, మిధాని వంటి సంస్థల్లో కేంద్రం వాటాలు తగ్గించుకోనుంది. ఈ సంస్థల్లో వాటాలను తగ్గించుకోవడం మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుందని రక్షణ శాఖ వెల్లడించింది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల్లో మైనర్‌ వాటాను బదిలీ చేస్తామని, యాజమాన్య నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈమేరకు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోంది. ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేటుపరం చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సోమవారం నుంచి సమ్మె ప్రారంభించాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని