Gadkari: రహదారి ప్రమాద మరణాల్ని 50% తగ్గించడమే కేంద్రం టార్గెట్‌!

దేశంలోని రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో మరణాలను నివారించడంపై కేంద్రం దృష్టిసారించిందని కేంద్ర ఉపరితల..........

Published : 10 May 2022 18:58 IST

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

దిల్లీ: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల్ని నివారించడంపై కేంద్రం దృష్టిసారించిందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 2024 నాటికి రోడ్డు ప్రమాద మరణాల్ని 50శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. దిల్లీలో నిన్న జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రహదారుల భద్రత అనేది చాలా తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్ని నివారించడమే లక్ష్యంగా పనిచేయాలని.. బ్లాక్‌ స్పాట్‌ (రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా పేర్కొంటారు)లపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంతీయ అధికారులు, ప్రాజెక్టు డైరెక్టర్లు రహదారులపై ప్రమాదాల నివారణను ఓ ప్రతిజ్ఞలా తీసుకోవాలని సూచించారు. రహదారి భద్రతకు సంబంధించిన సమస్యల్ని సమష్టిగా పరిష్కరించేందుకు వీలుగా వాహనదారులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా గడ్కరీ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని