ఐఎంఏ వైద్యుల రిలే నిరాహార దీక్షలు

ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు కేంద్రం అనుమతించడాన్ని నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు చెందిన వైద్యులు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

Published : 01 Feb 2021 22:14 IST

దిల్లీ: శస్త్రచికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు కేంద్రం అనుమతించడాన్ని నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ (ఐఎంఏ)‌కు చెందిన వైద్యులు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని ఐఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా మహిళా వైద్యులు ఈ దీక్షను నడిపిస్తారని వెల్లడించింది.

పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతినిస్తూ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ గతంలో ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిని ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఐఎంఏ వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంఘాలు ఈ రిలే దీక్షల్లో పాలుపంచుకోనున్నట్లు వారు తెలిపారు. ఇటువంటి విధానాలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రజారోగ్యంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ప్రజా ప్రతినిధులకు ఈ విధానంలో ఉన్న లోపాలను అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. అంతర్జాతీయ వైద్య సంఘాల సహకారం కూడా తీసుకుంటామని వారు వెల్లడించారు.

ఇవీ చదవండి..

బడ్జెట్‌లో ఎన్నికల వరాలు

పీఎఫ్‌ మొత్తాలపై పన్ను

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని