viral news: ‘ఇంగ్లిష్‌లో ఫెయిలైతే పెళ్లి చేస్తారు’! జవాబు పత్రంలో ఓ విద్యార్థిని వింత ‘అభ్యర్థన’

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ లో ఓ విద్యార్థిని తనను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ పరీక్షపత్రంలో రాసిన అభ్యర్థన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 12 Mar 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశవ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని గట్టెక్కడానికి కొందరు రాత్రంతా పుస్తకాలతో కుస్తీ పడుతుంటే మరికొందరు చీటీలను సిద్ధం చేసుకుంటుంటారు. ఇవేవీ కాకుండా ఇంకొందరు విద్యార్థులు ఇన్విజిలేటర్‌లను ప్రసన్నం చేసుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తారు. ఈవిధంగానే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ లో ఓ విద్యార్థిని జవాబుపత్రంలో రాసిన అభ్యర్థన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఓ విద్యార్థిని మాత్రం.. తాను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ జవాబుపత్రంలో ప్రాధేయపడింది. ఇంగ్లిష్‌ పరీక్షలో ఫెయిల్‌ అయితే తండ్రి తనకు పెళ్లి చేస్తాడని, ఆ వివాహం నుంచి తప్పించుకోవాలంటే పాస్‌ అవ్వాలని పేర్కొంది. ఎలాగైనా తాను ఆంగ్ల పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా చూడాలని కోరింది.

మరో విద్యార్థి 1991లో బాలీవుడ్‌లో విడుదలైన సాజన్‌ చలనచిత్రం నుంచి ఓ పాటను జవాబుకు బదులుగా రాశాడు. వీటికి సంబంధించిన జవాబుపత్రాల ఫొటోలను ఓ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. దీనిపై ఓ నెటిజన్ సరదాగా స్పందిస్తూ.. ‘కాబోయే ఐఏఎస్‌ అధికారి’ అంటూ రాసుకొచ్చాడు. మరికొందరు తాము చదువుకునే రోజుల్లో పరీక్షలు రాసేటప్పుడు చేసిన అల్లరి పనుల గురించి పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని