India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు.. 50 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు..!

యదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మాత్రం కొత్త కేసులు 18 శాతం మేర తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదైన కేసులు 6 వేలకు దిగొచ్చాయి.

Published : 14 Jun 2022 10:13 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే.. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదైన కేసులు 6 వేలకు దిగొచ్చాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.  

* సోమవారం 3.21 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 6,594 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు మూడు శాతం దాటిన పాజిటివిటీ రేటు తాజాగా 2.05 శాతానికి తగ్గింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. మహారాష్ట్ర, దిల్లీ, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి చూపిస్తోంది. కొవిడ్ అంతం కాలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హెచ్చరించారు. 

* 24 గంటల వ్యవధిలో 4,035 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.67 శాతానికి పడిపోయింది. 

* ప్రస్తుతం క్రియాశీల కేసులు 50 వేల మార్కు దాటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50,548కి చేరి.. ఆందోళన కలిగిస్తోంది. దాంతో మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.12 శాతానికి ఎగబాకింది. ఇక ఇప్పటివరకూ 195 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని