Coronavirus: దేశంలో కొత్తగా 20వేల కేసులు, 36 మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా మరో 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడగా 36 మరణాలు నమోదయ్యాయి.

Updated : 24 Jul 2022 10:05 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా మరో 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడగా 36 మరణాలు నమోదయ్యాయి. ముందురోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 5.3శాతం తగ్గినప్పటికీ గడిచిన 24గంటల్లో 2100 యాక్టివ్‌ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య లక్షా 52వేలకు చేరింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 4.38కోట్లు దాటింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో కొవిడ్‌ మరణాలు చోటుచేసుకొంటున్నాయి. శనివారం 36 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,26,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసులు 20లక్షల మార్కును తొలిసారి 2020 ఆగస్టు 7న దాటింది. అలా ప్రతినెలా సుమారు పది లక్షల కొత్త కేసులతో డిసెంబర్‌ 2020 నాటికి కోటికి చేరుకొంది. అనంతరం 2021 మే నెల నాటికి రెండు కోట్లు, జూన్‌ నాటికి మూడు కోట్ల కేసులు నమోదయ్యాయి. ఇలా ఈ ఏడాది జనవరి 25 వచ్చేసరికి కేసుల సంఖ్య 4కోట్లకు చేరుకుంది. తాజాగా ఆసంఖ్య 4.38కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం నిత్యం 20వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని