
హెచ్-1బి వీసాలపై తేలని స్పష్టత
న్యూయార్క్: అమెరికాలో విదేశీ నిపుణులకు అందించే హెచ్-1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన నిషేధాన్ని తొలగించే అంశంపై బైడెన్ సర్కారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని అమెరికా హోంల్యాండ్ భద్రత కార్యదర్శి అలెజాండ్రో మేయర్కాస్ తెలిపారు. హింస చెలరేగిన దేశాల నుంచి పారిపోయి వస్తున్న వారి అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
హెచ్-1బీ వీసాల జారీపై విధించిన నిలుపుదల ఈనెల 31 వరకు పొడిగిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు జనవరిలో నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ట్రంప్ హయాం నాటి నిర్ణయాలను రద్దు చేస్తున్న జోబైడెన్ హెచ్-1బీ జారీ నిలుపుదలపై చర్య తీసుకోలేదు. వీసా నిలుపుదల, జారీ విషయానికి సంబంధించిన వివరాలు తనకు తెలియవని అలెజాండ్రో మీడియాతో వెల్లడించారు. అమెరికా మరమ్మతు, పునరుద్ధరణ, పునఃనిర్మాణం కోసం తమ యంత్రాంగం కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనికి తమకు ప్రాధాన్యత క్రమం ఉందన్నారు.
ఇవీ చదవండి
Advertisement