Mamata: భాజపా ప్రభుత్వానికి ఇదే ‘అంతిమ’ బడ్జెట్‌.. ధర్నాలో దీదీ

తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం నిలిపివేసిందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నా చేపట్టారు.

Updated : 02 Feb 2024 19:52 IST

కోల్‌కతా: లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget) భాజపా సర్కార్‌ అంతిమ బడ్జెట్‌గా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం నిలిపివేసిందని ఆరోపిస్తూ కోల్‌కతాలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో దీదీ పాల్గొన్నారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాల కోసం కేంద్రం నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2011లో తమ ప్రభుత్వం తొలిసారి అధికారం చేపట్టినప్పటినుంచి.. కేంద్రం నిధులు ఎలా వినియోగించిందన్న పత్రాలను సమర్పించామని మమత చెప్పారు. ‘మేం అధికారంలోకి రాకముందు.. వామపక్ష ప్రభుత్వ పాలనలో జరిగిన దానికి మేం ఎందుకు బాధ్యత వహించాలి?” అని ఆమె ప్రశ్నించారు. అంతకుముందు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించిన దీదీ.. తన పార్టీ నేతలతో కలిసి మైదాన్ ప్రాంతంలో నిరసన కొనసాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని