Tapsi Upadhyay: ‘బీటెక్ పానీపూరీ వాలీ’.. ఈ అమ్మాయి రూటే సపరేటు!
దిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్ చదివి పానీపూరీ విక్రయిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బీటెక్(Btech) పూర్తిచేసిన వారు మామూలుగా అయితే దర్జాగా కూర్చొని చేసే కార్పొరేట్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకుంటారు..! అమ్మాయిలైతే తమకు నచ్చిన ఉద్యోగంలో చేరడమో.. పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావడమే జరుగుతుంటుంది. కానీ, దిల్లీకి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్(Tapsi Upadhyay) రూటే సపరేటు. 21 ఏళ్ల వయసున్న ఈ అమ్మాయి బీటెక్ చదివినా ప్రజలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వినూత్న ఆలోచనతో తాను అందుకున్న పట్టా పేరుతోనే ‘బీటెక్ పానీపూరీ వాలీ’గా అవతారమెత్తింది. సొంతంగా ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి దిల్లీ నగర వీధుల్లో బుల్లెట్ బండిపై ధైర్యంగా తిరుగుతూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
హరియాణాలోని రోహ్‌తక్‌లో మహర్షి దయానంద్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన తాప్సీ ఉపాధ్యాయ్.. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు . ఇందులో భాగంగానే ఎయిర్‌ఫ్రైస్ పూరీలను తయారు చేసి వాటిని విక్రయించడం ప్రారంభించారు. ఇందుకోసం ఓ మొబైల్ స్టాల్‌ను సైతం ఏర్పాటు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో ధైర్యంగా సంచరిస్తూ ఆరోగ్యకరమైన, రుచికరంగా ఉండే పానీపూరీని తయారు చేస్తూ అందుబాటులో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. ఇలా ఎంచుకున్న పలు ప్రాంతాల్లో పానీపూరీ విక్రయించడం ద్వారా తనదైన చలాకీతనంతో, నిబద్ధతతో అందరి దృష్టినీ ఆకర్షించి ‘బీటెక్ పానీపూరీవాలీ’గా ఫేమస్ అయిపోయారు. దీనికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించిన తాప్సీ.. అందులో కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. అలాగే, ఫ్రాంచైజీలను సైతం ఆహ్వానిస్తూ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కృషిచేస్తున్నారు.
ఇటీవల ఓ నెటిజన్ ఈ స్టాల్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. తన స్టాల్‌ను ప్రారంభించి అందిస్తోన్న స్ట్రీట్‌ఫుడ్ గురించి ఆమె వివరిస్తున్న ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 3లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోలో ఆమె ఆహారం గురించి వివరించడంతో పాటు ఓ మహిళగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బీటెక్ పూర్తి చేసి పానీపూరీ ఎందుకు విక్రయిస్తున్నవంటూ చాలా మంది అడుగుతున్నారని.. ఓ యువతి ఇలా వీధుల్లో ఉండటం సురక్షితం కాదు.. ఇంటికి వెళ్లిపోవాలని మరికొందరు సలహా ఇస్తున్నారని తాప్సీ వివరించారు. మరోవైపు, ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె కృషిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సూపర్ గర్ల్.. అలా కొనసాగించు.. ఆశీస్సులు ఉంటాయి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘గట్టి పిల్ల. ఆ భగవంతుడు నీకు మరింత విజయం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ మరో వ్యక్తి ఆకాంక్షించారు. ఇంకో నెటిజన్ అయితే ‘గ్రేట్ జాబ్ సిస్టర్.. ఐ సెల్యూట్ యూ’’ అని కామెంట్ పెడుతూ ప్రశంసలు కురిపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్‌లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం