Modi: విమానాశ్రయానికి వచ్చి, మోదీని స్వయంగా ఆహ్వానించిన డెన్మార్క్ ప్రధాని

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డెన్మార్క్ చేరుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌ విమానాశ్రయంలో దిగిన మోదీని డెన్మార్క్‌ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్సెన్ స్వయంగా ఆహ్వానించారు.

Published : 03 May 2022 18:00 IST

దిల్లీ: మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డెన్మార్క్ చేరుకున్నారు. ఈ క్రమంలో రాజధాని నగరం కోపెన్‌హాగెన్‌ విమానాశ్రయంలో దిగిన మోదీని డెన్మార్క్‌ ప్రధాని మెట్టే ఫ్రెడ్రిక్సెన్ స్వయంగా ఆహ్వానించారు. మన పద్ధతిలో మోదీ మొదట నమస్కారం చేయగా.. ఆమె ప్రతి నమస్కారం చేశారు. అనంతరం కరచాలనం చేసుకున్నారు. ఈ ఆహ్వానాన్ని ఉద్దేశిస్తూ.. ‘ప్రత్యేక సంజ్ఞ’ అంటూ భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. 

‘డెన్మార్క్ ప్రధాని నుంచి వచ్చిన ఈ ప్రత్యేక సంకేతం చూడటానికి అద్భుతంగా ఉంది. వీరిద్దరు ప్రధాని అధికారిక నివాసంలో చర్చలు జరిపారు. వారి మధ్య ఉన్న సానుకూలత.. భారత్, డెన్మార్క్ మధ్య సన్నిహిత సంబంధాలకు అద్దం పడుతోంది’ అంటూ పలు చిత్రాలను షేర్ చేశారు. కాగా, ఈ ఇరువురు నేతలు రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ నిన్న జర్మనీకి వెళ్లారు. ప్రస్తుతం డెన్మార్క్‌లో ఉన్న ఆయన.. రేపు ఫ్రాన్స్‌ వెళ్లి, భారత్‌కు తిరిగిరానున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని