దిల్లీలో ఒక్క రోజే 53 శాతం పెరిగిన కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాచినట్లు కనిపిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ సారి పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్‌.. ప్రస్తుతం   దేశ రాజధానిలో పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 2,790 కొత్త కేసులు నమోదు కాగా, 9 మంది మృతిచెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది...

Published : 01 Apr 2021 21:43 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చుతోన్న వైరస్‌.. ప్రస్తుతం దేశ రాజధానిలో పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దిల్లీలో 2,790 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మృతిచెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. నిన్న 1,819 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఒక్క రోజు వ్యవధిలోనే 53 శాతం పెరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దిల్లీలో భారీ సంఖ్యలో కొత్త కేసులు రావడం ఈ సంవత్సరంలో ఇదే తొలిసారి అని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని