కేరళలో కొత్తరకం మలేరియా!

కేరళలో కొత్త రకం మలేరియా వెలుగులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజా టీచర్‌ వెల్లడించారు. ప్లాస్మోడియం ఒవాల్‌ అనే జాతికి చెందిన పరాన్నజీవితో సంక్రిమించే అరుదైన మలేరియా జ్వరాన్ని గుర్తించినట్లు వెల్లడించారు......

Published : 11 Dec 2020 11:35 IST

తిరువనంతపురం: కేరళలో కొత్త రకం మలేరియా వెలుగులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజా టీచర్‌ వెల్లడించారు. ప్లాస్మోడియం ఒవాల్‌ అనే జాతికి చెందిన పరాన్నజీవితో సంక్రిమించే అరుదైన మలేరియా జ్వరాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. సుడాన్‌ నుంచి వచ్చిన ఓ సైనికుడిలో దీన్ని గుర్తించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆయన కన్నూర్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.

మలేరియా జ్వరాల్లో చాలా రకాలుంటాయి. పరాన్నజీవి జాతిని బట్టి వీటిని ప్లాస్మోడియం ఫాల్సిపెరం, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం నోలెసీ, ప్లాస్మోడియం ఒవాల్‌ అని ఐదు రకాలుగా వర్గీకరించారు. తాజాగా కేరళలో గుర్తించిన ఒవాలే జాతి చాలా అరుదైనది. పశ్చిమాఫ్రికా, పశ్చిమ పసిఫిక్‌లోని ద్వీప దేశాల్లో కనిపిస్తుంటుంది. ఆఫ్రికా వెలుపల ఏటా దీని బారినపడేవారు ఒకశాతం లోపే. 1922లో దీన్ని తొలిసారి కనుగొన్నారు. అయితే, ఇది ప్రాణాంతకం కాకపోవడం ఊరటనిచ్చే అంశం. కానీ, మలేరియాకు కారణమయ్యే పరాన్నజీవుల్లో ఔషధాలకు తట్టుకోగలిగేలా డీఎన్‌ఏలో మార్పులు జరగుతున్నట్లు గతంలో పరిశోధకులు గుర్తించారు. దీంతో తాజా ఒవాల్‌ రకం భారత్‌లోకి ప్రవేశించడంతో.. దానిలో ఏమైనా పరివర్తనాలు జరగొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి దశలోనే దీన్ని గుర్తించి అరికట్టడం అన్ని రకాలుగా శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి..

డబ్ల్యూహెచ్‌వో ఆందోళన నిజమైంది!

రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని