దిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధింపు
దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండటంతో..వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు, నగరాలు కఠిన ఆంక్షల అమలుకు మొగ్గుచూపుతున్నాయి.
నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనున్న ఆంక్షలు
దిల్లీ: దేశవ్యాప్తంగా రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుండటంతో..వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు, నగరాలు కఠిన ఆంక్షల అమలుకు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా దిల్లీ ప్రభుత్వం ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని వాటిలో పేర్కొంది. దిల్లీలో ప్రస్తుతం నాలుగో దఫా వైరస్ విజృంభణ కనిపిస్తోందని, అయితే లాక్డౌన్ యోచన లేదని శుక్రవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సరైన సంప్రదింపుల అనంతరమే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
గడిచిన 24 గంటల్లో దిల్లీలో 3,548 మందికి కరోనా సోకగా.. 15 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మొత్తంగా 6,79,962 మంది వైరస్ బారినపడ్డారు. 11,096 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..