Nitish Kumar: కాంగ్రెస్‌ వల్లే ‘ఇండియా’ జోరు తగ్గింది : నీతీశ్‌ కుమార్‌

ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే (Assembly Elections) కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైందని, విపక్షాల కూటమిపై (INDIA) అంతగా దృష్టిపెట్టడం లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ విమర్శించారు.

Updated : 02 Nov 2023 20:00 IST

పట్నా: జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార తీరుపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే (Assembly Elections) ఆ పార్టీ నిమగ్నమైందని, విపక్షాల కూటమిపై (INDIA) అంతగా దృష్టిపెట్టడం లేదని విమర్శించారు. తద్వారా మొన్నటివరకు కనిపించిన ‘ఇండియా’ కూటమి దూకుడు కొనసాగించలేక పోతోందన్నారు. ‘భాజపా హటావో దేశ్‌ బచావో’ పేరుతో పట్నాలో సీపీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్రంలో ప్రస్తుత పాలనను వ్యతిరేకించే పార్టీలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడిందన్నారు.

‘విపక్షాల కూటమిలో పెద్దగా పురోగతి లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్‌ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌నే ముందుండి నడిపించేందుకు అందరం అంగీకరించాం. కానీ, ఈ ఎన్నికల తర్వాతే మళ్లీ సమావేశం ఏర్పాటుకు వారు సిద్ధమైనట్లు కనిపిస్తోంది’ అని నీతీశ్ కుమార్‌ పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఆలస్యం అవుతోందన్నారు. ఇక భాజపాపై విరుచుకుపడిన ఆయన.. దేశ చరిత్రను మార్చేందుకు వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే వేదికపై ఉన్న జేడీయూ నేతలు కూడా కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు.. సమన్లు వాపస్‌ తీసుకోవాలని లేఖ..!

సీసీఐ జనరల్‌ సెక్రటరీ డీ రాజాతో కలిసి వేదిక పంచుకున్న నీతీశ్‌ కుమార్‌.. సుమారు నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టు పార్టీలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మొదటిసారిగా తాను ఎన్నికల బరిలో దిగిన సమయంలో సీపీఐ, సీపీఎంలు తన విజయానికి కలిసి పని చేశాయన్నారు. బిహార్‌లో కమ్యూనిస్టుల ప్రగతిశీల దృక్పథాన్ని ఎంతో కీర్తించేవారమని, అప్పట్లో వారి ర్యాలీల్లో ఎంతోమంది మహిళలు పాల్గొనేవారని నీతీశ్‌ కుమార్‌ గుర్తుచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు