
రెండో సంవాదం లేదు
ప్రకటించిన డిబేట్స్ కమిషన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య జరగాల్సిన రెండో ముఖాముఖిపై సందిగ్ధత వీడింది. అక్టోబర్ 15న జరగాల్సిన ప్రత్యక్ష చర్చను రద్దు చేస్తున్నట్లు ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్(సీపీడీ)’ అధికారికంగా ప్రకటించింది. ఇక అక్టోబర్ 22న జరగాల్సిన తుది ముఖాముఖిపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది.
చర్చలో పాల్గొనాల్సిన ట్రంప్‌నకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన చికిత్స పూర్తి చేసుకున్నారు. శనివారం నుంచి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, చర్చలో పాల్గొనే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రెండో ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని సీపీడీ నిర్ణయించింది. దీనిపై ఇద్దరు అభ్యర్థులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాను నేరుగా చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వర్చువల్ ముఖాముఖికి ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు బైడెన్ ట్రంప్‌తో నేరుగా చర్చలో పాల్గొనేది లేదని ప్రకటించారు. అనంతరం ఇద్దరూ అక్టోబర్ 15 రాత్రి చర్చ జరగాల్సిన సమయంలో ఇతర కార్యక్రమాల్ని పెట్టుకున్నారు. దీంతో ముఖాముఖి చర్చ నిర్వహించడం సాధ్యం కాదని సీపీడీ ప్రకటించింది. ఈ నెల 22న జరగాల్సిన తుది దశ చర్చకు మాత్రం ఇద్దరూ అంగీకరించినట్లు వెల్లడించింది.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చించడం గతకొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ చర్చలను సీపీడీ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ట్రంప్, బైడెన్ల మధ్య తొలి సంవాదం సెప్టెంబరు 29న జరిగింది. ఆ తర్వాత రెండు రోజులకే ట్రంప్ కరోనా బారినపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Eoin Morgan: ఆ ‘గన్’ ఇక పేలదు.. రిటైర్మెంట్ ప్రకటించిన మోర్గాన్
-
General News
GHMC: భారీ వర్షం కురిసే అవకాశం... అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: జీహెచ్ఎంసీ
-
India News
ONGC Helicopter: సముద్రంలో పడిపోయిన హెలికాప్టర్.. నలుగురి మృతి
-
Business News
GST: ఆతిథ్య సేవలపై జీఎస్టీ మినహాయింపు.. పోస్ట్ సేవలపై పన్ను పోటు
-
General News
Health: తరచుగా గర్భం ఎందుకు పోతుందో తెలుసుకోండి..!
-
Politics News
TS Highcourt: మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Madhavan: ఇది కలా.. నిజమా! మాధవన్‌ను చూసి ఆశ్చర్యపోయిన సూర్య..!
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- ఆవిష్కరణలకు అందలం