One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్రం ఏమంటోందంటే?

దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. ......

Published : 22 Jul 2022 23:26 IST

దిల్లీ: దేశ రాజకీయ యవనికపై జమిలి ఎన్నికల అంశం మరోసారి చర్చకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణలో ఉన్న సాధ్యాసాధ్యాలు ప్రస్తుతం లా కమిషన్‌ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వ సమాధానంలో వెల్లడించారు. ‘‘ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)తో చర్చించాం. దీనిపై అనేక భాగస్వామ్య పక్షాలతోనూ చర్చించాం. స్టాండింగ్‌ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫారసులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్‌ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తుంది. ప్రణాళికను తయారు చేసే పనిలో లా కమిషన్‌ నిమగ్నమైంది. వేర్వేరుగా ఎన్నికల వల్ల భారీగా  ప్రజాధనం ఖర్చవుతుందని నివేదిక పేర్కొంది. 2014-22 మధ్య కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.. ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో ఎన్నికల నిర్వహణ ఖర్చు దాదాపు రూ.7వేల కోట్లుగా ఉంది’’ అని జమిలి ఎన్నికల అంశంపై లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని