Job Vacancies: కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 14,600 అధ్యాపక పోస్టులు ఖాళీ

కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 14వేలకు పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.

Updated : 13 Feb 2023 18:19 IST

దిల్లీ: కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఉన్నత విద్యా సంస్థల్లో భారీగా అధ్యాపక పోస్టుల ఖాళీలు(faculty job vacancy) ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ(Lok Sabha)లో వెల్లడించింది. మొత్తంగా 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో 14,606 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఇప్పటివరకు 6వేల  అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల్ని భర్తీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లోనే కొందరు పదవీ విరమణ చేయడం, మరికొందరు రాజీనామాలు చేయడానికి తోడు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో అదనపు అవసరాల రీత్యా ఈ పోస్టుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయని వివరించారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఆయా విద్యా సంస్థలు తగిన చర్యలను తీసుకుంటున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని