అంబానీ ఇంటి వద్ద వాహనం కేసులో కీలక మలుపు

దక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Published : 05 Mar 2021 18:56 IST

పేలుడు పదార్థాలున్న స్కార్పియో యజమాని ఆత్మహత్య

ముంబయి: దక్షిణ ముంబయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో కొద్ది రోజుల క్రితం పేలుడు పదార్థాలున్న వాహనం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఠానే పోలీసులు వెల్లడించారు. పేలుడు పదార్థాలున్న వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ మృతదేహం శుక్రవారం ముంబయికి సమీపంలోని ఓ వాగులో గుర్తించినట్లు తెలిపారు. ఆయన ఓ వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు.

ఫిబ్రవరి 25న జిలెటిన్‌ స్టిక్స్‌తో ఉన్న ఓ స్కార్పియో ఎస్‌యూవీ వాహనాన్ని అంబానీ ఇంటికి సమీపంలో పోలీసులు గుర్తించారు. ఆ వాహనం విక్రోలీలో నివసించే మన్‌సుఖ్‌ హిరెన్‌కు చెందిందని పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు. ఆ వాహనంలో నీతా అంబానీకి రాసిన ఓ ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం అంతకుముందే చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ వాహనాన్ని తామే ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద ఉంచినట్లు జైష్‌- ఉల్‌- హింద్ సంస్థ ప్రకటించుకుంది. కానీ ఈ ఘటనతో ఆ సంస్థకు సంబంధంలేదని పోలీసులు స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని