184మంది వీఐపీలకు భద్రత తొలగింపు.. పంజాబ్‌ సీఎం మరో సంచలన నిర్ణయం!

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం ....

Published : 24 Apr 2022 01:41 IST

చండీగఢ్‌: ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో 184 మంది ప్రముఖులకు భద్రతను ఉపసంహరించుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రయివేటు వ్యక్తుల భద్రతను తొలగించింది. భద్రత పొందుతున్న ప్రముఖులకు ప్రస్తుతం ఉన్న ముప్పునకు సంబంధించి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం భద్రతా విభాగం సూచనలతో సెక్యూరిటీని తొలగించినట్టు ఈ నెల 20న రాసిన లేఖలో అదనపు డీజీపీ (సెక్యూరిటీ) పేర్కొన్నారు. భద్రత తొలగించిన ప్రముఖుల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కుటుంబ సభ్యులతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నవారి భద్రత మాత్రం కొనసాగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని