Rahul Gandhi: ఐదో రోజు ముగిసిన రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఐదోరోజు విచారణ ముగిసింది. విచారణ అనంతరం రాహుల్‌ ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. 

Updated : 22 Jun 2022 00:11 IST

సుదీర్ఘంగా సాగిన విచారణ 

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఐదోరోజు విచారణ ముగిసింది. విచారణ అనంతరం రాహుల్‌ ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఈ విచారణలో రాహుల్‌ గాంధీ నుంచి ఈడీ అధికారులు లిఖితపూర్వక సమాధానాలు తీసుకున్నారు. రాహుల్‌ వాంగ్మూలం నమోదు చేశారు. ఐదు రోజుల్లో మొత్తం 55 గంటలకు పైగా రాహుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం నుంచి దాదాపు 10 గంటలకుపైగానే రాహుల్‌ గాంధీ విచారణ ఎదుర్కొన్నారు. సాయంత్రం 8గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ గాంధీ అరగంట విరామం తర్వాత మళ్లీ విచారణకు వెళ్లారు.  

మనీ లాండరింగ్‌ కేసులో రాహుల్‌ గాంధీని విచారిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. గతవారం మూడురోజుల్లో దాదాపు 30 గంటలపాటు విచారించింది. మళ్లీ సోమవారం పది గంటలపాటు విచారణ జరపగా.. మంగళవారం కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇలా ఇప్పటివరకు ఈ ఐదురోజుల్లో రాహుల్‌ గాంధీని దాదాపు 55 గంటలకుపైగా ఈడీ విచారించినట్లయ్యింది. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా జూన్‌ 23న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని