Rahul Gandhi: మమతపై వ్యాఖ్యలు.. సొంత నేతపై రాహుల్ గాంధీ అసహనం

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్‌, తృణమూల్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ పార్టీ నేత నుంచి వచ్చిన విమర్శలపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. 

Updated : 23 Jan 2024 18:09 IST

దిల్లీ: పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తనకు అత్యంత ఆత్మీయురాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు.  తృణమూల్(TMC) అధినేత్రిపై హస్తం పార్టీ సీనియర్‌ నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. ‘మమత బెనర్జీ నాకు అత్యంత ఆత్మీయురాలు. కొన్నిసార్లు మా నేతలు ఏదో మాట్లాడుతుంటారు. అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు’ అని మీడియాతో చెప్పారు. కొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిమిత్తం బెంగాల్‌లోని లోక్‌సభ సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా ప్రస్తుతం రాహుల్‌ అస్సాంలో ఉన్నారు.

ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాక విచారణ ఎందుకు?

ఇదిలా ఉంటే.. మొత్తం బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్‌ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని కొన్ని కథనాలు వెలువడ్డాయి. వీటిపై స్పందిస్తూ.. ఆమె అవకాశవాది అని అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. ‘మమత సహాయంతో మేం ఎన్నికల్లో పోటీ చేయం. సొంత బలంతో పోటీ చేయడం ఎలాగో కాంగ్రెస్‌కు తెలుసు. మా పార్టీ సహకారంతోనే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలి’ అని దుయ్యబట్టారు. సీట్ల పంపకం చర్చల్లో భాగంగా.. 42 స్థానాల్లో కేవలం రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్‌కు టీఎంసీ ఆఫర్ చేసిందని సమాచారం. కానీ కాంగ్రెస్‌ మాత్రం మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ రెండు పార్టీలు విపక్ష ‘ఇండియా’కూటమిలో కీలకమైనవి. భాజపాను ఓడించే లక్ష్యంతో ఆ కూటమి ఏర్పడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని