Indian Railways: రైల్వేల్లో భారీగా తగ్గిన డీజిల్‌ వాడకం.. గతేడాది ఖర్చెంతంటే?

రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైళ్లలో డీజిల్‌ వినియోగం(diesel consumption ) భారీగా తగ్గుతోందని కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 50శాతానికి పైగా వినియోగం తగ్గినట్టు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw ) తెలిపారు.

Published : 08 Dec 2022 01:46 IST

దిల్లీ: రైల్వే లైన్ల విద్యుదీకరణతో రైళ్లలో డీజిల్‌ వినియోగం(diesel consumption ) భారీగా తగ్గుతోందని కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 50శాతానికి పైగా వినియోగం తగ్గినట్టు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnaw ) తెలిపారు. లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. 2018-19లో రైల్వేల డీజిల్‌ వినియోగం 26,41,142 కిలో లీటర్లు ఉండగా.. 2019-20 నాటికి అది 10.44శాతం మేర తగ్గింది. అలాగే, 2020-21 ఆర్థిక ఏడాదికి దీని వినియోగం దాదాపు 50.29శాతం మేర తగ్గడంతో 11,75,901 కిలో లీటర్లుగా ఉంది.

ఈ ఇంధనం కోసం 2018-19లో రూ.18,587.14కోట్లు ఖర్చు చేయగా.. 2019-20లో రూ.16,377.60 కోట్ల ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. అయితే, గత ఆర్థిక సంవత్సరం నాటికి (2020-21 నాటికి డీజిల్‌ వినియోగానికి అయిన మొత్తం రూ.11,435.70కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. విద్యుదీకరణ ప్రాజెక్టులు పూర్తి కావడం రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర మంత్రిత్వశాఖల సంబంధిత విభాగాల నుంచి అనుమతులపై ఆధారపడి ఉంటుందని.. అందువల్ల ఈ ప్రాజెక్టులు కచ్చితమైన సమయానికి పూర్తవుతాయని చెప్పడం సాధ్యంకాదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని