INS Sandhayak: ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను జాతికి అంకితమిచ్చిన రాజ్‌నాథ్‌

‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ (INS Sandhayak)’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) శనివారం జాతికి అంకితం ఇచ్చారు.

Published : 03 Feb 2024 10:00 IST

విశాఖ: ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ (INS Sandhayak)’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) శనివారం జాతికి అంకితం ఇచ్చారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్క పాల్గొన్నారు.

హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో.. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను నిర్మించింది. దీని నిర్మాణానికి 2019లో నాంది పలికి.. 2021 డిసెంబరు 5న జలప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్‌, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్‌ యంత్రాలు అమర్చారు. సంధాయక్‌ నౌకకు కమాండింగ్‌ అధికారిగా కెప్టెన్‌ ఆర్.ఎం.థామస్‌ వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని