RTI activist: 9వేల పేజీల డేటాతో ఎడ్లబండిపై ఊరేగింపు.. ఆర్టీఐ కార్యకర్త విజయోత్సాహం

సమాచారహక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అధికారుల నుంచి 9 వేల పేజీల సమాచారాన్ని పొందిన ఓ వ్యక్తి.. డిపాజిట్‌ ఫీజు కింద అప్పు చేసి మరీ రూ.25 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది.

Updated : 05 Nov 2022 09:44 IST

సమాచారహక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద అధికారుల నుంచి 9 వేల పేజీల సమాచారాన్ని పొందిన ఓ వ్యక్తి.. డిపాజిట్‌ ఫీజు కింద అప్పు చేసి మరీ రూ.25 వేల వరకు చెల్లించాల్సి వచ్చింది. ఈ పేజీలను లెక్క పెట్టడానికి రెండు గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. దీని కోసం నలుగురు వ్యక్తులను సైతం వెంట తెచ్చుకున్నాడు. సమాచారం పొందిన అనంతరం డప్పు వాయింపుల మధ్య ఎడ్లబండిపై ఊరేగి హడావుడి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన ఆర్టీఐ కార్యకర్త మఖన్‌ ధాకడ్‌.. బైరాడ్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్‌టీఐ కింద ఓ దరఖాస్తు పెట్టుకున్నాడు. అందులో పీఎం హౌసింగ్‌, సంబల్‌ పథక నిర్మాణపనుల్లో చెల్లింపులతోపాటు స్వచ్ఛత మిషన్‌ కింద కౌన్సిల్‌ కొనుగోలు చేసిన సామగ్రి గురించి సమాచారం కోరాడు. స్థానిక అధికారులు స్పందించకపోవడంతో అప్పీలుకు భోపాల్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి నుంచి సమాచారం రాగానే.. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి మఖన్‌ ఊరేగాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని