Jharkhand: వృద్ధుడి పింఛను ఖాతాలో రూ.75 కోట్లు జమ!

ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడి పింఛను ఖాతాలో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయ్యాయి. ఈ సంఘటనకు ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు. జార్ముండి మండలం సాగర్‌ గ్రామంలో

Updated : 13 Jan 2022 08:03 IST

ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడి పింఛను ఖాతాలో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయ్యాయి. ఈ సంఘటనకు ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు. జార్ముండి మండలం సాగర్‌ గ్రామంలో కుమారుడు, భార్యతో కలిసి ఫూలోరాయ్‌ అనే వ్యక్తి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో అతనికి ఖాతా ఉంది. పింఛను డబ్బులు తీసుకోవడానికి ఫూలోరాయ్‌.. సమీపంలోని రూరల్‌ సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాడు. రూ.10,000 తీసుకున్నాడు. కానీ ఖాతాలో మిగిలిన డబ్బులు చూసుకుంటే. రూ.75.28 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదని చెప్పాడు. దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు.. ఫూలోరాయ్‌ ఖాతాలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని