దశాబ్దంలోనే అత్యధికం.. గడ్డకట్టిన నెదర్లాండ్స్‌

దశాబ్దంలోనే అత్యంత శీతల వాతావరణంతో నెదర్లాండ్స్‌ గడ్డకట్టుకుపోతోంది. ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతి శీతల వాతావరణ ప్రభావంతో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఉత్తరాన ఉన్న ఇజెల్మీర్‌ సరస్సు గడ్డకట్టింది....

Published : 22 Feb 2021 01:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దశాబ్దంలోనే అత్యంత శీతల వాతావరణంతో నెదర్లాండ్స్‌ గడ్డకట్టుకుపోతోంది. ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతి శీతల వాతావరణ ప్రభావంతో ఆమ్‌స్టర్‌డ్యామ్‌ ఉత్తరాన ఉన్న ఇజెల్మీర్‌ సరస్సు గడ్డకట్టింది. సరస్సు నుంచి 32 కిలోమీటర్ల మేర ఉన్న డ్యాం వరకు నీటిపై మంచు ఫలకాలు తేలుతున్నాయి. నెదర్లాండ్స్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 20 డిగ్రీలకు చేరినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి నుంచి వేడి గాలులు వీచే అవకాశాలు మెరుగుపడుతుండటంతో శీతల వాతావరణం నుంచి కాస్త ఉపశమనం కలగొచ్చని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని