Fake work: గంట పనికి.. రూ.కోట్ల జీతమా..?

కొన్ని దిగ్గజ సాఫ్ట్‌ కంపెనీల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు తక్కువ శ్రమతో రూ. కోట్ల జీతాలను పొందుతున్నారంటూ ఫార్చ్యూన్‌ పత్రిక కథనం ప్రచురించింది. దీనికి ఆధారంగా రోజుకు గంట మాత్రమే పనిచేసి ఏటా రూ.1.2 కోట్ల వేతనం పొందుతున్న ఓ యువ ఉద్యోగి ఇంటర్వ్యూను కూడా ప్రచురించింది. 

Updated : 23 Aug 2023 13:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫేక్‌ వర్క్‌’ (Fake work) ఇటీవల టెక్‌ పరిశ్రమలను వేధిస్తోంది. కొందరు ఉద్యోగులు కొన్ని గంటలు మాత్రమే పని చేసి మిగతా సమయంలో ఖాళీగా ఉంటూ.. వేతనాలు పొందుతున్నారని ఆయా కంపెనీల సీఈవోలు చర్చలు జరిపారు. ఇటీవల ఫార్చూన్‌ (Fortune) పత్రిక ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసింది. అతడు రోజుకు గంట మాత్రమే పని చేసి ఏడాదికి దాదాపు 1.50 లక్షల డాలర్ల (రూ. 1.2 కోట్లు)ను సంపాదిస్తున్నాడని తెలిపింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. అసలు అతడు చేసే పనేంటంటే.. 

20 ఏళ్ల డేవాన్‌ (పేరు మార్చారు) అనే వ్యక్తి గూగుల్‌ (Google) ఉద్యోగి. అతడు రోజంతా కష్టపడకుండా కేవలం గంట మాత్రమే పని చేస్తానంటూ తెలిపారు. మేనేజర్‌ ఇచ్చే కోడ్‌ను పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అందుకు అతడు కోడ్‌లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని తెలిపాడు. మిగిలిన పనిని వారం రోజుల్లోపు తాపీగా పూర్తి చేస్తానని వివరించాడు. అయితే, ఇందుకోసం రోజంతా కష్టపడకుండా వేగంగా కోడ్‌ను రాస్తానని.. దీని కోసం కేవలం గంట సమయాన్ని కేటాయిస్తానని తెలిపాడు. ‘‘ఉదయం అల్పాహారం అనంతరం గంట పాటు గూగుల్‌ కోసం పని చేస్తాను. దీని కోసం రోజంతా కష్టపడను. మిగిలిన సమయాన్ని నా స్టార్టప్‌ కోసం వినియోగిస్తున్నాను. మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్‌లో పని చేసే వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతుంటారు. రోజంతా కష్టపడకుండా చాలామంది ఇంజినీర్లు వేల జీతాలు పొందుతున్నారు. వారిలో నేను కూడా ఒకడినే’’ అని అన్నారు.

జాసన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కూడా గతంలో ఇన్‌సైడర్‌ ఇంటర్వ్యూ చేయగా.. అతడు వారానికి 30 గంటల కంటే ఎక్కువ పని చేయనని వెల్లడించారు. పనిభారం తక్కువగా ఉండడంతో అతడు రెండు ఫుల్‌టైం ఉద్యోగాలను చేస్తున్నట్లు వివరించాడు. ఒకవేళ ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తే ఒక ఉద్యోగాన్ని వదిలేసేవాడినని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు