Sonia Gandhi: ఆ రోజున హాజరుకండి: సోనియాకు మరోసారి ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు( money laundering case)లో కొత్త తేదీని నిర్ణయిస్తూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి సోమవారం ఈడీ(ED) మరోసారి సమన్లు జారీ చేసింది.

Published : 11 Jul 2022 19:21 IST

దిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు( money laundering case)లో కొత్త తేదీని నిర్ణయిస్తూ.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)కి సోమవారం ఈడీ(ED) మరోసారి సమన్లు జారీ చేసింది. జులై 21న ఆమె దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని వాటిలో పేర్కొంది. 

ఈ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి ఇది వరకే ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో కొద్దిరోజుల పాటు రాహుల్‌ను ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాల్సిన సమయంలోనే సోనియా కరోనాబారిన పడి, తదనంతర సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. జూన్‌ నెల చివర్లో డిశ్ఛార్జి అయ్యారు. విశ్రాంతి నిమిత్తం మరికొంత గడువు ఇవ్వాలని ఆమె ఈడీకి లేఖ రాశారు. ఆ క్రమంలోనే తాజాగా  కొత్త తేదీని నిర్ణయించింది. మరోపక్క రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇదివరకే ఐదు రోజులపాటు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన్ను ఈడీ దాదాపు 50 గంటల పాటు ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని