US: వ్యాక్సిన్‌ వేసుకున్నా.. మాస్క్‌ ధరించినా ట్యాక్సీ ఎక్కనివ్వరట!

అమెరికాలో ఒకవైపు వ్యాక్సినేషన్‌ వేగవంతంగా జరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్లను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వివిధ కారణాలతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఇలాంటివారికి అమెరికాలో ఓ రెస్టారెంట్‌ ఇటీవల మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ వేసుకోని

Updated : 07 Aug 2021 15:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఒకవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్లను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వివిధ కారణాలతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అక్కడి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఇలాంటివారికి అమెరికాలో ఓ రెస్టారెంట్‌ ఇటీవల మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ వేసుకోని వారికి, మాస్క్‌లు ధరించని వారికి మాత్రమే తమ రెస్టారెంట్లోకి అనుమతిస్తామని ప్రకటించింది. తాజాగా మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలోని ‘యో’ ట్యాక్సీ కంపెనీ కూడా ఇదే విధంగా ప్రకటన విడుదల చేసింది. తమ ట్యాక్సీల్లోకి వ్యాక్సిన్‌ వేసుకోకుండా ఉండి, మాస్క్‌ ధరించని ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకుంటామని వెల్లడించింది. 

తమ సంస్థ వ్యాక్సినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సంస్థ అధినేత చార్లీ బెల్లింగ్టన్‌ బహిరంగ ప్రకటన చేశారు. తమ ప్యాసింజర్లు వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేదా అని ముందుగానే పరిశీలిస్తామని.. మాస్క్‌ ధరించకపోతేనే ట్యాక్సీ ఎక్కనిస్తామని చెప్పారు. యూఎస్‌ఏలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వెనుకబడి ఉన్న టాప్‌ 3 రాష్ట్రాల్లో మిస్సోరీ ఒకటిగా నిలిచిన్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. మిస్సోరీ ప్రజలు వ్యాక్సిన్‌కు వ్యతిరేకిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని