Bill Gates:బిల్‌గేట్స్‌కు ‘శృంగ’భంగం?..మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం

దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగవివక్షకు సంబంధించిన ఫిర్యాదుల దర్యాప్తు వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నట్లు

Updated : 15 Jan 2022 16:35 IST

సియాటెల్‌: దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగవివక్షకు సంబంధించిన ఫిర్యాదుల దర్యాప్తు వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా తమ విధానాలను సమీక్షిస్తామని చెప్పింది. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్‌ సహా బోర్డు డైరెక్టర్లందరికీ ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సంస్థ విధానాలను సమీక్షించేందుకు థర్డ్‌ పార్టీ న్యాయసంస్థను మైక్రోసాఫ్ట్‌ నియమించుకోనున్నట్లు ‘ది సియాటెల్‌ టైమ్స్‌’ గురువారం ఓ కథనం ప్రచురించింది. ఇతర సంస్థలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నాయి.. ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్‌లను జవాబుదారీగా ఉంచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలను థర్డ్‌ పార్టీ సంస్థ పరిశీలించనుంది. మైక్రోసాఫ్ట్‌లో ఇప్పటిదాకా ఎన్ని లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణలు జరిగాయి, వాటిపై తీర్మానాలేంటి? అనే వివరాలను సమీక్ష అనంతరం బహిరంగంగా వెల్లడించనున్నట్లు పేర్కొంది. కేవలం నివేదికను సమీక్షించడమే కాకుండా ఉద్యోగులకు అనువైన వాతావరణం కల్పించేందుకు ఏం చేయాలనే విషయాలనూ తెలుసుకుంటామని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని