Train: ఇక రైలు ప్రయాణాలకు వినియోగ ఛార్జీలు అదనం!

రైలు ప్రయాణికుల నుంచి  ఇకపై ‘వినియోగ ఛార్జీలు’ కూడా వసూలు చేసేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. నిర్దేశిత రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణం చేయాలన్నా.. ఆయా ప్రాంతాల్లో దిగాలన్నా అదనంగా ఛార్జీలు

Updated : 10 Oct 2021 10:16 IST

ఈనాడు, దిల్లీ: రైలు ప్రయాణికుల నుంచి  ఇకపై ‘వినియోగ ఛార్జీలు’ కూడా వసూలు చేసేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. నిర్దేశిత రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణం చేయాలన్నా.. ఆయా ప్రాంతాల్లో దిగాలన్నా అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పునర్‌ అభివృద్ధి చేసిన.. చేయబోయే స్టేషన్ల నుంచి రాకపోకలకు ఇది వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఛార్జీలు టిక్కెట్టు ధరకు అదనంగా రూ.10 నుంచి రూ.50 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని