Passport: కవర్‌ ఆర్డర్‌ చేస్తే పాస్‌పోర్ట్‌ వచ్చింది!

కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఈ-కామర్స్‌ సైట్‌ ద్వారా వింత అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్‌ పెట్టుకునేందుకు ఓ కవర్‌ కోసం ఆర్డర్‌ పెడితే.. ఆ కవర్‌తో పాటు ఓ పాస్‌పోర్ట్‌ కూడా వచ్చింది. ఈ ఘటన వయనాడ్‌ జిల్లా

Updated : 06 Nov 2021 10:04 IST

కోజికోడ్‌: కేరళకు చెందిన ఓ వ్యక్తికి ఈ-కామర్స్‌ సైట్‌ ద్వారా వింత అనుభవం ఎదురైంది. పాస్‌పోర్ట్‌ పెట్టుకునేందుకు ఓ కవర్‌ కోసం ఆర్డర్‌ పెడితే.. ఆ కవర్‌తో పాటు ఓ పాస్‌పోర్ట్‌ కూడా వచ్చింది. ఈ ఘటన వయనాడ్‌ జిల్లా కనియమ్‌బెట్టాలో జరిగింది. మిథున్‌ బాబు గత నెల 30న ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఓ పాస్‌పోర్ట్‌ కవర్‌ను ఆర్డర్‌ చేశాడు. ఈ నెల 1న అతడి ఆర్డర్‌ డెలివరీ అయింది. పార్సిల్‌ తెరిచి చూస్తే అందులో మరో వ్యక్తికి చెందిన పాస్‌పోర్ట్‌ కూడా ఉంది. అతను కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయగా.. వారు ఇచ్చిన సమాధానంతో మిథున్‌ ఆశ్చర్యపోయాడు. ఈ తప్పిదం మరోసారి జరగదని.. విక్రయదారుడికి దీనిపై హెచ్చరిస్తామంటూ చెప్పి ఫోన్‌ పెట్టేశారు. దీనిపై స్థానిక ఠాణాలో మిథున్‌ ఫిర్యాదు చేశాడు. ఆ పాస్‌పోర్టు త్రిస్సూర్‌కు చెందిన మహ్మద్‌ సాలిహ్‌కు చెందినదిగా గుర్తించారు. ముందుగా ఆ కవర్‌ను సాలిహ్‌ ఆర్డర్‌ చేశాడని.. అందులో తన పాస్‌పోర్ట్‌ పెట్టి సరిచూసుకొని అది నచ్చకపోవడంతో దానిని రిటర్న్‌ చేశాడని అతడి భార్య అస్మాబీ తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు ఆ కవర్‌ నుంచి పాస్‌పోర్టు తీయలేదని ఇది తమ తప్పిదమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని