Taliban: తాలిబన్లకు తలవంచని పంజ్‌షేర్‌.. ఆయుధాలు వీడేందుకు ససేమిరా

అఫ్గానిస్థాన్‌లో తమకు ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షేర్‌ను ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని

Updated : 02 Sep 2021 10:11 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తమకు ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షేర్‌ను ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ ప్రావిన్సుపై దాడికి దిగినప్పుడు ఎదురుదెబ్బ తగలడంతో.. తాజాగా వారు చర్చల బాట పట్టారు. పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షేర్‌ నేతలు, పలువురు ఇతర గిరిజన తెగల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఆయుధాలు వీడి తమతో చేతులు కలపాలని పంజ్‌షేర్‌ ఫైటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే వారి చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్‌ అధికార ప్రతినిధి ముల్లా ఆమిర్‌ ఖాన్‌ ముత్తా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు- అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు తాము దాదాపు 350 మంది తాలిబన్‌ ముఠా సభ్యులను హతమార్చినట్లు పంజ్‌షేర్‌ ఫైటర్లు ప్రకటించారు. మరో 40 మందిని బంధించినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని